శనివారం 06 జూన్ 2020
Business - Apr 03, 2020 , 11:54:33

ఆకాశాన్నంటుతున్న ఐ ఫోన్ ధరలు

ఆకాశాన్నంటుతున్న ఐ ఫోన్ ధరలు

హైదరాబాద్ : లాక్ డౌన్ తో దేశంలో ఇప్పటికే ఆర్ధిక పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇప్పుడు ఈ సెగ  స్మార్ట్ ఫోన్లకు తగిలింది. మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాలపై 12 శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు 18 శాతానికి పెరగడంతో ఒక్కసారిగా వాటి ధర రెట్టింపు అయ్యింది. ఆపిల్ ఫోన్ల ఉత్పత్తి ఆగిపోవడంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నది. దీని వల్ల మార్కెట్లో ఉన్న ఆపిల్‌ ఫోన్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.. సవరించిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా 64 జీబీ ఐఫోన్‌ 11 ధర రూ.64,900 నుంచి రూ.68,300లకు చేరింది. 64 జీబీ ఎక్స్‌ఆర్‌ మోడల్‌ రూ.2,600 పెరిగి రూ.52,500లకు చేరింది. ఇక రూ.1,01,200 64 జీబీ 11 ప్రో ధర.. రూ.1,06,600 కు పెరిగింది. 64 జీబీ 11 ప్రో మ్యాక్స్‌ రూ.1,11,200 నుంచి రూ.1,17,100కు చేరుకుంది. ఇక 32 జీబీ ఐఫోన్‌ 7 రూ.1,600 పెరిగి రూ.31,500లుగా ఉంది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo