సోమవారం 01 మార్చి 2021
Business - Feb 19, 2021 , 01:20:43

భారత్‌లో ఐప్యాడ్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌!

భారత్‌లో ఐప్యాడ్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ప్లాంట్లను నెలకొల్పడానికి సిద్ధమవగా..తాజాగా ఇదే జాబితాలోకి అంతర్జాతీయ సంస్థ యాపిల్‌ ఐప్యాడ్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నది. దేశీయ ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, నూతన ఉద్యోగ అవకాశాలు సృష్టించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ సర్కార్‌ గతేడాది 6.7 బిలియన్‌ డాలర్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. చైనాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తు వస్తున్న సంస్థ..భారత్‌లో ఐఫోన్ల తయారీని క్రమంగా పెంచుకుంటున్నది. స్థానికంగా తయారవనున్న ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లను ప్రోత్సహించడానికి పీఎల్‌ఐ స్కీంను ప్రకటించింది. దీనికింద ఎగుమతుల ఆధారంగా తయారీదారులకు వచ్చే ఐదేండ్లకాలంలో రూ.7 వేల కోట్ల వరకు నగదు ప్రోత్సహాకాలు అందించబోతున్నది. ఈ స్కీంను ప్రస్తుత నెల చివర్లో ప్రకటించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు సూచనప్రాయంగా చెప్పాయి. మరోవైపు యాపిల్‌తోపాటు ఇతర సంస్థలు కలిసి రూ.20 వేల కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయి. 

VIDEOS

తాజావార్తలు


logo