గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 10, 2021 , 03:19:08

ఐవోబీ లాభం 213 కోట్లు

ఐవోబీ లాభం 213 కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐవోబీ) ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. గడిచిన త్రైమాసికంలో రూ.212.87 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. ఏడాది క్రితం ఇదే కాలానికిగాను బ్యాంక్‌ రూ.6,057.49 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపు తగ్గుముఖం పట్టడం లాభాల్లోకి రావడానికి ప్రధాన కారణమని బ్యాంక్‌ విశ్లేషించింది. 2019-20 ఏడాది మూడో త్రైమాసికంలో రూ.5,197.94 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ ఆదాయం..గత త్రైమాసికానికి రూ.5,786.51 కోట్లకు పెరిగినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

VIDEOS

logo