సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి త్రిబుల్ ఐటీలోని సీఐఈ (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్) ఇంక్యుబేషన్ సెంటర్లో కొత్తగా అప్టమ్ స్టార్టప్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్టూడియోలో ఎమర్జింగ్ హెల్త్ టెక్ స్టార్టప్‌లను గుర్తించి, వాటి ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యం గా పెట్టుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఎంపికైన స్టార్టప్‌లకు అప్టమ్ సంస్థ ఫాస్ట్ ట్రాక్ పైలెట్‌గా వ్యవహరిం చి, అవసరమైన నిధులను సమకూరుస్తుంది. మరిన్ని వివరాలకు https://optum.in/ solutions లో సంప్రదించాలని నిర్వహకులు సూచించారు.