ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 01, 2021 , 17:22:23

బ‌డ్జెట్ ప్ర‌సంగం: ‌రూ.5.2 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన సంప‌న్నుల సంప‌ద

బ‌డ్జెట్ ప్ర‌సంగం: ‌రూ.5.2 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన సంప‌న్నుల సంప‌ద

న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి రెట్టింపు నిధుల కేటాయింపు, మౌలిక వ‌స‌తుల రంగానికి ప్రాధాన్యం క‌ల్పిస్తామ‌ని కేంద్ర విత్త మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించ‌డం ఇన్వెస్ట‌ర్లు, కార్పొరేట్లు, సంప‌న్నుల సంప‌ద.. ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లింది. ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌సంగం పూర్త‌య్యే స‌మ‌యానికి బీఎస్ఈ సెన్సెక్స్‌లోని ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.5.2 ల‌క్ష‌ల కోట్లు ఎగ‌బాకింది. 

దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.191.32 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్న‌ది. ఇండ‌స్ఇండ్ బ్యాంక్ సార‌థ్యంలో దాదాపు బ్యాంకింగ్ షేర్ల‌న్నీ గ్రీన్‌లోనే ముగిశాయి. నిఫ్టీలోని 50 స్క్రిప్టుల్లో నాలుగు మిన‌హా 46 సంస్థ‌ల షేర్లు ల‌బ్ధి పొందాయి. మ‌ధ్యాహ్నం బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 2046 పాయింట్లు లాభ ప‌డింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo