శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 01, 2021 , 13:13:49

గ‌ంట‌లోనే సంప‌న్నుల సంప‌ద రూ.2.44 ల‌క్ష‌ల కోట్లు పైపైకి

గ‌ంట‌లోనే సంప‌న్నుల సంప‌ద రూ.2.44 ల‌క్ష‌ల కోట్లు పైపైకి

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం (2021-22)లో హెల్త్‌కేర్‌, ఆటోమొబైల్ త‌దిత‌ర రంగాల‌కు పెద్ద‌పీట వేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో దేశీయ స్టాక్ మార్కెట్లు రాకెట్‌లా పైపైకి దూసుకెళ్లాయి. నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభ‌మైన అర్ధ‌గంట‌లోనే వివిధ కార్పొరేట్‌ సంస్థ‌లకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంప‌న్నుల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.2.44 ల‌క్ష‌ల కోట్లు పెరిగింది. త‌ద్వారా బీఎస్ఈ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.188.57 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంది. 

నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచి నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం షేర్లు.. ఇండ‌స్ఇండ్ బ్యాంక్ 10 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 6.49 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 4.20 శాతం పెరిగాయి. హిందాల్కో ఇండ్స్ 4.15 శాతం, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్ 4.13 శాతం ల‌బ్ధి పొందాయి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.05 గంట‌ల‌క‌ల్లా నిఫ్టీ-5- 257.5 పాయింట్లు పెరిగింది. 49 స్టాక్స్ లాభాలు గ‌డించ‌గా, కేవ‌లం తొమ్మిది స్క్రిప్టులు మాత్రం న‌ష్టాల్లో చిక్కుకున్నాయి.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 913.97 పాయింట్లు పెరిగి 47,199.74 పాయిట్ల వ‌ద్ద స్థిర ప‌డింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 165.05 పాయింట్లు పెరిగింది. వొడాఫోన్ ఐడియా, టాటా మోటార్స్‌, సెయిల్‌, యెస్ బ్యాంక్‌, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ షేర్లు బాగా ట్రేడ‌య్యాయి. సుంద‌రం క్లేటోన్, ఐసీఐసీఐ బ్యాంక్‌, కేఎన్ఆర్ క‌న్‌స్ట్ర‌క్ట్‌, సుజ్లాన్ ఎన‌ర్జీ, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు తాజా 52 వారాల గ‌రిష్టాలు న‌మోదు చేసుకున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo