శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 22, 2021 , 19:21:09

నిమిషానికి రూ.1000 కోట్ల పెట్టుబ‌డులు హ‌రీ..

నిమిషానికి రూ.1000 కోట్ల పెట్టుబ‌డులు హ‌రీ..

న్యూఢిల్లీ: దేశీయంగా అక్క‌డ‌క్క‌డా పెరుగుతున్న క‌రోనా కేసులు సోమ‌వారం ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌ను దెబ్బ‌తీశాయి. పెరుగుతున్న బాండ్ల జారీ.. తీవ్రమవుతున్న అనిశ్చిత ప‌రిస్థితుల‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు నెత్తురోడాయి. ఫ‌లితంగా ఇంట్రా డే ట్రేడింగ్‌లో నిమిషానికి ఇన్వెస్ట‌ర్లు రూ.1000 కోట్ల పై చిలుకు పెట్టుబ‌డుల చొప్పున కోల్పోయారు. ట్రేడింగ్ ముగిసే స‌రికి ఇన్వెస్ట‌ర్లు రూ.3.80 ల‌క్ష‌ల కోట్లు న‌ష్ట‌పోయారు. మార్కెట్ల ప‌త‌నానికి స్వ‌ల్పకాలిక స‌ర్దుబాట్లు కూడా ప్ర‌భావం చూపాయి. 

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 1,145.44 పాయింట్లు (2.24 శాతం) న‌ష్ట‌పోయి మూడు వారాల త‌ర్వాత 50 వేల దిగువ‌న 49, 744.32 పాయింట్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. మ‌రోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 306.05 పాయింట్లు కోల్పోయి 14,675.70 పాయింట్ల వ‌ద్ద నిలిచింది. 

‘పెరుగుతున్న క‌రోనా కేసులతో ఆర్థిక ఆంక్ష‌లు ఎక్కువ కావ‌డంతోపాటు అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు బ‌ల‌హీనంగా ఉండ‌టం దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో సెంటిమెంట్‌ను బ‌ల‌హీన ప‌రిచాయి. మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ వీక్ కూడా స్టాక్స్ ప‌త‌నానికి కార‌ణం ’ అని జియోజిట్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ అధిప‌తి వినోద్ నాయ‌ర్ తెలిపారు. నిఫ్టీలో మెట‌ల్ ల‌బ్ధి పొంద‌గా, సెన్సెక్స్‌లో రిల‌య‌న్స్‌, హెచ్డీఎఫ్‌సీ, టీసీఎస్ భారీగా లాభ‌ప‌డ్డాయి. హెచ్డీఎఫ్‌సీ బ్యాంకుకు మ‌ద్ద‌తు ల‌భించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo