శుక్రవారం 05 జూన్ 2020
Business - May 06, 2020 , 00:29:26

రెండు రోజుల్లో రూ.7 లక్షల కోట్లు

రెండు రోజుల్లో రూ.7 లక్షల కోట్లు

  • సంపదను కోల్పోయిన మదుపరులు
  • వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబై, మే 5: స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాల్లో ముగిశాయి. కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి కొనసాగుతుండటంతో మదుపరులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు ఆర్థిక రంగ షేర్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లను నష్టాల వైపు నడిపించాయి. 810 పాయింట్ల శ్రేణిలో కదలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 261.84 పాయింట్లు పతనం చెంది 31,453.51 వద్దకు పడిపోగా, నిఫ్టీ 9,205.60 వద్ద ముగిసింది. దీంతో సూచీ 87.90 పాయింట్లు కోల్పోయినట్లు అయింది. దీంతో మదుపరుల సంపద అమాంతం కరిగిపోతున్నది. వరుసగా రెండు రోజుల్లో సూచీ రెండు వేల పాయింట్లకు పైగా నష్టపోవడంతో మదుపరులు రూ.7 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ.6,98,419.77 కోట్లు కోల్పోయి రూ.1,22,43,201.05 కోట్ల వద్దకు జారుకున్నది.  


logo