ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 21, 2020 , 02:19:35

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

  • ఐబీఎం సీఈవోతో ప్రధాని

న్యూఢిల్లీ, జూలై 20: భారతీయ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ దిగ్గజం ఐబీఎంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని ఆ సంస్థ సీఈవో అర్వింద్‌ కృష్ణతో అన్నారు. సోమవారం ఈ ఇరువురు సంభాషించుకున్నట్లు ప్రధాని కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. వ్యాపారంపై కరోనా ప్రభావం, ఇంటి దగ్గర్నుంచే పని తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు చెప్పాయి. కాగా, ఆత్మ నిర్భర్‌ భారత్‌పై ఐబీఎం సీఈవో విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారత్‌లో తమ సంస్థ పెట్టుబడుల ప్రణాళికను ఆయన ప్రధానికి వివరించారు.


logo