ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 13, 2021 , 03:02:00

డిజిటల్‌ బీమా పాలసీలు ప్రవేశపెట్టండి

డిజిటల్‌ బీమా పాలసీలు ప్రవేశపెట్టండి

  • బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: డిజిటల్‌ బీమా పాలసీలు ప్రవేశపెట్టండని అన్ని బీమా సంస్థలకు నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ సూచించింది. డిజిలాకర్‌తో డిజిటల్‌ పాలసీలను జారీ చేయాలని పేర్కొంది. బీమా రంగంలో డిజిలాకర్‌ను ప్రమోటింగ్‌ చేయడంలో భాగంగా..అన్ని బీమా సంస్థలు ఐటీ సిస్టమ్‌లో డిజిలాకర్‌ సదుపాయాన్ని ఉంచుకోవాల్సిందిగా ఇటీవల జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది. మరోవైపు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్‌ నేషనల్‌ మోటర్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ లైసెన్స్‌ లేకుండానే పాలసీలను జారీ చేస్తున్నదని, దీనిపై జాగ్రత్తగా ఉండాలని పాలసీలదారులకు సూచించింది. 

VIDEOS

logo