బుధవారం 08 జూలై 2020
Business - Jun 07, 2020 , 07:21:22

వడ్డీరేట్లను తగ్గించిన ప్రముఖ బ్యాంక్‌

వడ్డీరేట్లను తగ్గించిన ప్రముఖ బ్యాంక్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్‌.. రెపో రేటుతో అనుసంధనమైన రుణాలపై వడ్డీరేటును 40 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ రేటు 6.90 శాతానికి దిగొచ్చింది. అంతకుముందు ఇది 7.30 శాతంగా ఉన్నది. మరోవైపు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 20 బేసిస్‌ పాయింట్లు కుదించింది. తగ్గిన వడ్డీరేట్లు నేటి నుంచి అమలులోకి రానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంక్‌ తీసుకున్న తాజా  నిర్ణయంతో రిటైల్‌ రుణాలు (గృహ, ఎడ్యుకేషన్‌, వాహన), ఎంఎస్‌ఎంఈ రుణాలపై వడ్డీభారం మరింత తగ్గనున్నది. నెల రోజుల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.30 శాతానికి దిగిరానుండగా, మూడు నెలల రేటు 7.55 శాతానికి, ఆరు నెలలు రేటు 7.60 శాతానికి, ఏడాది రుణాలపై రేటు 7.65 శాతానికి తగ్గనున్నాయి. logo