శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 04, 2021 , 02:15:05

చిన్న మొత్తాలపై వడ్డీరేటు యథాతథం

చిన్న మొత్తాలపై వడ్డీరేటు యథాతథం

చిన్న మొత్తాలపై వడ్డీరేటును యథాతథంగా ఉంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి-మార్చి) లో పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీలతోపాటు చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌) వడ్డీరేటు 7.1 శాతంగా, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఎస్‌సీ)పై 6.8 శాతం వడ్డీ కొనసాగనున్నది. ప్రతి మూడు నెలలకొకసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వడ్డీరేట్లలో మార్పులు చేస్తున్నది. అయితే మూడో త్రైమాసికంలో ఉన్న వడ్డీరేట్లే నాలుగో త్రైమాసికంలోనూ కొనసాగనున్నాయని పేర్కొంది. అలాగే ఐదేండ్ల కాలపరిమితితో కూడిన సీనియర్‌ సిటిజన్ల పొదుపు ఖాతాలపై వడ్డీరేటు కూడా యథాతథంగా 7.4 శాతంగా, పొదుపు ఖాతాలపై వడ్డీరేటు 4 శాతంగా కొనసాగనున్నది. 

VIDEOS

logo