సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 20, 2020 , 23:21:25

వడ్డీ, జరిమానాలే రూ.70 వేల కోట్లు

వడ్డీ, జరిమానాలే రూ.70 వేల కోట్లు

ఏజీఆర్‌ బకాయిల్లో లైసెన్స్‌ ఫీజుకు సంబంధించిన బాకీల్లో 74 శాతం వడ్డీ, జరిమానాలు, జరిమానాలపై వడ్డీనే ఉండటం గమనార్హం. టెలికం శాఖకు టెలికం సంస్థల లైసెన్స్‌ ఫీజు బాకీలు రూ. 92,641 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ. 22,589 కోట్లు లైసెన్స్‌ ఫీజు బకాయి అవగా, మిగతాదంతా దీనిపై వడ్డీ, జరిమానాలు, ఆ జరిమానాలపై మళ్లీ వడ్డీనేనని సంబంధిత వర్గాల సమాచారం. కాగా, లైసెన్స్‌ ఫీజు బకాయిల్లో భారతీ ఎయిర్‌టెల్‌ వాటా రూ.5,528.52 కోట్లుగా ఉంటే, వొడాఫోన్‌ ఐడియాది రూ.6,870.69 కోట్లుగా ఉన్నది. టాటా గ్రూప్‌ రూ.2,321.31 కోట్లు, టెలినార్‌ (ఎయిర్‌టెల్‌లో విలీనమైంది) రూ.529.02 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.614 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ.876.39 కోట్ల బకాయిలున్నాయి. గతేడాది జూలై నాటికి టెలికం సంస్థల మొత్తం ఏజీఆర్‌ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లు. ఇందులో రూ.92,641 కోట్లు లైసెన్స్‌ ఫీజులకు సంబంధించినవి అవగా, మిగతా రూ.55,054 కోట్లు స్పెక్ట్రం వినియోగ చార్జీలు. ఇదిలావుంటే నిరుడు జూలై నాటికే ఈ లెక్కలని, ఇప్పటిదాకా లెక్కిస్తే బకాయిలు పెరుగుతాయని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 


logo