గురువారం 21 జనవరి 2021
Business - Dec 04, 2020 , 11:59:20

కొవిడ్ వ‌ల్ల జాబ్ పోతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా.. అయితే ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి!

కొవిడ్ వ‌ల్ల జాబ్ పోతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా.. అయితే ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి!

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల మందిని పొట్ట‌న బెట్టుకోవ‌డ‌మే కాదు.. మ‌రి కొన్ని ల‌క్ష‌ల‌ మందిని రోడ్డున ప‌డేసింది. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి చాలా దేశాలు లాక్‌డౌన్లు విధించ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గించి ఆ ప్ర‌భావం ఉద్యోగాల‌పై ప‌డింది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల కోటి మందికిపైగా తమ ఉద్యోగాలు కోల్పోయిన‌ట్లు తాజా గ‌ణాంకాలు తేల్చాయి. దీంతో ఈ అనిశ్చిత ప‌రిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయిన వారికి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు రంగంలోకి దిగాయి. ప్ర‌త్యేకంగా ఉద్యోగం కోల్పోయిన వారి కోసం ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను తీసుకొచ్చాయి.

ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న వారు త‌మ ఉద్యోగాలు కోల్పోతే లేదా కంపెనీలు మూత‌ప‌డితే.. వారి ఈఎంఐల‌ను బీమా సంస్థ చెల్లిస్తుంది. ఉద్యోగ భ‌ద్ర‌త సందిగ్ధంలో ప‌డ‌టంతో అమెరికాలో ఇప్ప‌టికే ప‌ది ల‌క్ష‌ల మందికిపైగా ఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్‌ల‌ను తీసుకున్నారు. ఒక‌వేళ వీళ్లు ఉద్యోగాలు కోల్పోతే వారి త‌ర‌ఫున బీమా సంస్థ మూడు నెల‌ల పాటు ఈఎంఐల‌ను చెల్లిస్తుంది. అయితే బీమా తీసుకున్న మూడు నెల‌ల త‌ర్వాతే దీని ప్ర‌యోజ‌నాలు అందుతాయి. వీఆర్ఎస్ తీసుకున్నా.. ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఉద్యోగాలు కోల్పోయినా.. ఎలాంటి క్లెయిమ్ పొంద‌లేరు. ఒక‌వేళ మీకు 50 ల‌క్ష‌ల లోన్ ఉండి.. నెల‌కు 25 వేల ఈఎంఐ క‌డుగున్నార‌నుకోండి. ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. మూడు ఈఎంఐలు.. అంటే రూ.75 వేలు బీమా సంస్థ చెల్లిస్తుంది. ఈ పాల‌సీ ప్రీమియం రూ.8 వేల నుంచి రూ.10 వేల వ‌ర‌కు ఉంది. 


logo