గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 02, 2020 , 16:39:23

ఇన్‌స్టాగ్రామ్‌లో తారల సంపాదన ఎంతో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో తారల సంపాదన ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ : ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఓ ఫొటో ద్వారా ఎవరైనా ఎంత సంపాదించవచ్చు? హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా కండ్లు చెదిరే మొత్తాన్ని సంపాదించాడు. ఇంకా సంపాదిస్తూనే ఉండి ఇన్‌స్టాగ్రామ్‌లో అధిక మొత్తంలో సంపాదిస్తున్న వారి జాబితాలో అగ్రభాగాన నిలిచాడు. మన బాలీవుడ్ తారలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. చాలా మంది బాలీవుడ్‌ నటులు కూడా తమ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లోపోస్ట్‌ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

సోషల్ మీడియా సంస్థ హాప్పర్ హెచ్‌క్యూ డాట్‌ కామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదించే ప్రముఖుల వార్షిక జాబితా 'ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2020' ను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, డ్వేన్ మొదటి స్థానంలో ఉండి 1,015,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.7.4 కోట్లు)  సంపాదించాడు. నాలుగేండ్లలో కిమ్‌ కర్దాషియన్ గానీ, జెన్నర్ గానీ అగ్రస్థానంలో నిలువలేకపోయారని మిర్రర్ ఆన్‌లైన్ నివేదించింది. డ్వేన్‌ జాన్సన్ ఆదాయాలు 15 శాతం పెరగ్గా.. సోషలైట్‌ బిజినెస్‌మ్యాన్‌ కైలీ జెన్నర్ ఆదాయంలో 22 శాతం పడిపోయింది.

డ్వేన్ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ది రాక్ అనే అకౌంట్‌ను కలిగి ఉండగా.. ఆయనకు 188 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, లారా దత్తా, అతియా శెట్టి, రాజ్‌కుమార్ రావ్‌, సిద్ధార్థ్ మల్హోత్రా సహా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసకడుతున్నారు. ఈ జాబితాలో ప్రియాంక చోప్రా సంఖ్య 28 వ స్థానంలో ఉన్నది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా 2,89,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ.2 కోట్లు) సంపాదిస్తున్నది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 54.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగివున్న బాలీవుడ్‌ నటుల్లో అమితాబ్ బచ్చన్ నుంచి వరుణ్ ధావన్ వరకు ఎందరో ఉన్నారు. బేవాచ్ చిత్రం నుంచి ప్రియాంక హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రియాంక భర్త నిక్ జోనాస్.. డ్వేన్‌తో కలిసి జుమాన్జీ సిరీస్ చిత్రాలలో పనిచేశారు.

ఇలాఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల ద్వారా ఎక్కువ సంపాదించే వారిలో క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. ఈయన 66 మిలియన్ల ఫాలోవర్లతో 26 వ స్థానంలో ఉండి.. 2,96,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ.2 కోట్లు) సంపాదించారు. ప్రియాంక, విరాట్ సంపాదన మధ్య పెద్దగా తేడా లేదు. 

హాప్పర్ హెచ్‌క్యూ డాట్‌ కామ్ జాబితాలో క్రిస్టియానో రోనాల్డో (889,000 డాలర్లు), కిమ్‌ కర్దాషియాన్‌ (858,000 డాలర్లు), అరియానా గ్రాండే (853,000 డాలర్లు), సెలెనా  గోమేజ్‌ (848,000 డాలర్లు), బియాన్స్‌ నోల్స్‌ (770,000 డాలర్లు) జస్టిన్‌ బైబర్‌ (747,000 డాలర్లు), టైలర్‌ స్విఫ్ట్‌ (722,000 డాలర్లు), నెయ్‌మార్‌ డా సిల్వా సాంటోస్‌ జూనియర్‌ (704,000 డాలర్లు) ఉన్నారు. వంద మంది జాబితాలో భారత్‌కు చెందిన విరాట్‌ కోహ్లీ, ప్రియాంక చోప్రా మాత్రమే చోటు దఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మిచెల్ క్రీగర్, గూగుల్ మాజీ ఉద్యోగి కెవిన్ సిస్ట్రోమ్ కలిసి 2010 లో స్థాపించారు. ఏప్రిల్ 2012 లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్‌ సంస్థ 1 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. సిస్ట్రోమ్ 2018 వరకు సీఈవోగా కొనసాగగా.. క్రిగెర్ కూడా సంస్థను విడిచిపెట్టారు.


View this post on Instagram

Two hand philosophy. #letswork #ip #itmatters

A post shared by therock (@therock) on


logo