గురువారం 28 జనవరి 2021
Business - Nov 24, 2020 , 16:02:17

కొత్త ఇన్నోవా క్రిస్టా @ 16.26 ల‌క్ష‌లు

కొత్త ఇన్నోవా క్రిస్టా @ 16.26 ల‌క్ష‌లు

కొత్త డిజైన్‌తో ఇన్నోవా క్రిస్టా ఇండియాలో లాంచ్ అయింది. ఈ కొత్త మోడ‌ల్ ధ‌ర రూ.16.26 ల‌క్ష‌ల నుంచి రూ.24.33 ల‌క్ష‌లు (ఎక్స్‌షోరూమ్ ధ‌ర‌)గా ఉంది. జీఎక్స్‌, వీఎక్స్‌, జ‌డ్ఎక్స్ గ్రేడ్స్‌లో ఈ మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహికిల్ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఇన్నోవా బ‌య‌టి భాగం డిజైన్ మారింది. ఇక లోప‌ల క్యాబిన్ కూడా ప్రీమియం వెహికిల్ ఫీల్ క‌లిగేలా మార్పులు చేశారు. వాహన ముందు భాగంలో కొత్త‌గా గ్రిల్ ఏర్పాటు చేశారు. బంప‌ర్ డిజైన్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇక క్యాబిన్‌లో కొత్త‌గా ఇన్ఫోటైన్‌మెంట్ ట‌చ్‌స్క్రీన్ వ‌చ్చింది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను స‌పోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ఇన్నోవా క్రిస్టా ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచ‌నుంది. ఏడు ఎయిర్‌బ్యాగులు, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్ స్టార్ట్ అసిస్ట్‌లు ఇందులో ఉన్నాయి. ఇరుకుగా ఉండే ప్ర‌దేశాల్లో పార్కింగ్ చేసిన‌ప్పుడు ముందు ఉన్న వాహ‌నాల‌ను ఢీకొట్ట‌కుండా ఎంఐడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ కొత్త మార్పుల‌తో ఎంపీవీల్లో త‌మ ఆధిప‌త్యాన్ని నిలుపుకుంటామ‌ని టొయోటా కంపెనీ ఆశాభావం వ్య‌క్తం చేసింది. 


logo