బుధవారం 02 డిసెంబర్ 2020
Business - Oct 01, 2020 , 02:28:27

ఇండోసోమ్‌ చాంబర్‌ ప్రారంభం

ఇండోసోమ్‌ చాంబర్‌ ప్రారంభం

హైదరాబాద్‌: భారత్‌-సోమాలియా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇండ్‌-సోమ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ను రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా సోమాలియా లాంటి దేశాలపై భారత్‌ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.  ఇరు దేశాల మధ్య ఇప్పటికే 600 మిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరిగాయని, త్వరలో ఇది బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకోనున్నదని ఇండోసోమ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యవస్థాపకుడు కిరణ్‌ తెలిపారు. సోమాలియాలో పెట్టుబడులు పెట్టేవారి కోసం వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది.