బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Dec 22, 2020 , 19:38:52

డైమ్లెర్ నుండి బిలియన్ డాలర్ల ఒప్పందం పొందిన ఇన్ఫోసిస్‌

డైమ్లెర్ నుండి బిలియన్ డాలర్ల ఒప్పందం పొందిన ఇన్ఫోసిస్‌

బెంగళూరు: హైబ్రిడ్ క్లౌడ్ పవర్డ్ ఇన్నోవేషన్, ఐటీ మౌలిక సదుపాయాల పరివర్తన కోసం జర్మనీ ఆటోమోటివ్ మేజర్ డైమ్లెర్ నుంచి ఒక ఒప్పందాన్ని పొందినట్లు సాఫ్ట్‌వేర్ మేజర్ సంస్థ ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ ఒప్పందం పరిమాణాన్ని ఇన్ఫోసిస్ వెల్లడించలేదు. అయితే, ఒప్పందం విలువ బిలియన్ డాలర్లకు పైగా ఉండొచ్చునని ఐటీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇటీవలనే ఇన్ఫోసిస్‌ సంస్థ వాన్గార్డ్ నుంచి పెద్ద ఒప్పందాన్ని సంపాదించుకున్న కొన్ని నెలలకే మరో ఒప్పందం రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలోనే ఇన్ఫోసిస్‌కు ఇది రెండవ బిలియన్ డాలర్ల ఒప్పందం కావడం సంతోషకరమైన విషయం.

డైమ్లెర్ ప్లాంట్లు, దానికి సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ మౌలిక సదుపాయాలను కలిగి ఉన్న మోడల్ కోసం కృషి చేస్తున్నది. అలాగే దాని డాటా సెంటర్ల ఏకీకరణకు కూడా మద్దతు ఇవ్వనున్నది. ఈ భాగస్వామ్యంలో భాగంగా జర్మనీ, యూరప్, అమెరికాతోపాటు ఏపీఐసీ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటోమోటివ్ ఐటీ మౌలిక సదుపాయాల నిపుణులు డైమ్లెర్ ఏజీ నుంచి ఇన్ఫోసిస్‌కు మారుతారు.

"ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మేము సామర్థ్యాలు, పర్యావరణ వ్యవస్థలు, హైబ్రిడ్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఒకచోట చేర్చుకుంటాం. అది డైమ్లెర్ ఏజీ, దాని పరిశ్రమలకు కొత్త అనుభవాలను రూపొందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఖాతాదారులకు వారి డిజిటల్ ప్రయాణాలను నావిగేట్ చేయడంలో ఇన్ఫోసిస్‌కు లోతైన నైపుణ్యం ఉంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఆటోమోటివ్ పరిశ్రమకు కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేయడానికి ఎదురుచూస్తున్నాం ”అని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo