బుధవారం 03 మార్చి 2021
Business - Jan 27, 2021 , 18:00:04

టాప్ 10 ఐటీ సేవల బ్రాండ్‌ ‘’ ఇన్ఫోసిస్

టాప్ 10 ఐటీ సేవల బ్రాండ్‌ ‘’ ఇన్ఫోసిస్

బెంగ‌ళూరు: అత్యంత వేగంగా వృద్ధి రేటు సాధిస్తున్న టాప్‌-10 ఐటీ దిగ్గ‌జ సంస్థ‌ల్లో ఒక‌టిగా ఇన్ఫోసిస్ గుర్తింపు తెచ్చుకున్న‌ది. ఈ సంగ‌తిని ఇన్ఫోసిస్ సీఈవో స‌లీల్ ప‌రేఖ్ బుధ‌వారం ప్ర‌క‌టించారు. ‘బ్రాండ్ ఫైనాన్స్’ గ్లోబ‌ల్-500 2021 నివేదిక‌లో గ‌త మూడేండ్ల ఇన్ఫోసిస్ వాల్యూయేష‌న్ ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. గ‌త మూడేండ్లో ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 29 శాతానికి పైగా పెరిగింది. 2021 ర్యాంకింగ్ ప్ర‌కారం దాని విలువ 8.4 బిలియ‌న్ల డాల‌ర్లు. దీంతో టాప్‌-5లోకి త‌మ సంస్థ వ‌చ్చి చేరింద‌ని ఇన్ఫోసిస్‌ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

‘నావిగేట్ యువ‌ర్ నెక్స్ట్‌’ వ్యూహంలో అమ‌లులో భాగంగా గ‌త మూడేండ్ల‌లో బ్రాండ్ బ‌లోపేత‌మైంది. డిజిట‌ల్ స‌ర్వీసెస్ ప్రొవైడ‌ర్‌లో అగ్ర‌శ్రేణి సంస్థ‌గా ఇన్ఫోసిస్ నిలిచింది. విభిన్న డిజిట‌ల్ సంస్థ‌ల్లో వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల‌ను సాగిస్తూ.. స‌మ‌ర్థ‌వంతమైన మార్కెటింగ్‌తో సేల్స్ పెంచుకుంటున్న‌ట్లు ఇన్ఫోసిస్ సీఈవో స‌లీల్ ప‌రేఖ్ వెల్ల‌డించారు. క్ల‌యింట్ల‌ను పెంచుకుంటూ గ్లోబ‌ల్ బిజినెస్‌లో భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేసుకుంటున్న‌ట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo