శనివారం 06 జూన్ 2020
Business - Mar 28, 2020 , 22:38:38

ఇన్ఫోసిస్‌ ఉద్యోగిపై వేటు

ఇన్ఫోసిస్‌ ఉద్యోగిపై వేటు

  • కరోనాపై బాధ్యతారహిత ట్వీట్‌కు మూల్యం

న్యూఢిల్లీ, మార్చి 28: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ వ్యాప్తిపై బాధ్యతారహితంగా సోషల్‌ మీడియాలో అనుచితమైన పోస్టుచేసినందుకు ముజీబ్‌ మహ్మద్‌ అనే ఇన్ఫోసిస్‌ ఉద్యోగిపై వేటుపడింది. ఆ ఉద్యోగిని తమ సంస్థ నుంచి తొలిగించినట్టు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ‘మనమంతా కలిసికట్టుగా బయటకెళ్లి బహిరంగ ప్రదేశాల్లో తుమ్ముదాం. తద్వారా వైరస్‌ను వ్యాప్తిచేద్దాం’ అంటూ గురువారం ఆ ఉద్యోగి ట్వీట్‌ చేశాడు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు పోస్టుపై ఇన్ఫోసిస్‌ దర్యాప్తు జరిపింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ ట్వీట్‌ పొరపాటున చేసినదికాదని దర్యాప్తులో తేలడంతో ముజీబ్‌ మహ్మద్‌కు ఉద్వాసన పలికామని ఇన్ఫోసిస్‌ వివరించింది.


logo