బుధవారం 03 జూన్ 2020
Business - Apr 17, 2020 , 08:19:55

ఎంఎస్‌ఎంఈలను ఆదుకోండి

ఎంఎస్‌ఎంఈలను ఆదుకోండి

  • కేంద్రానికి పారిశ్రామిక సంఘాల విజ్ఞప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాలని దేశీయ వ్యాపార, పారిశ్రామిక సంఘాలు కోరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం కుదేలవుతున్న తరుణంలో ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలువకుంటే దేశంలో లక్షలాది పరిశ్రమలు మూతపడుతాయని, నిరుద్యోగం పెచ్చరిల్లుతుందని హెచ్చరిస్తున్నాయి. రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), టీఐఎఫ్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ), అఖిల భారత సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల మండలి (ఏఐఎఫ్‌ఎస్‌ఎంఐ) డిమాండ్‌ చేస్తున్నాయి. ఈఎస్‌ఐ చట్టం ప్రకారం ఉద్యోగులకు 2 నెలల వేతనాలను చెల్లించాలని, కొత్తగా మరిన్ని రుణాలు మంజూరు చేయాలని, ఇప్పటికే ఉన్న రుణాలపై వడ్డిని మాఫీ చేయాలని కోరుతున్నారు. ఇక భారీ పరిశ్రమల కంటే ఎంఎస్‌ఎంఈల్లోనే ఉపాధి అవకాశాలు ఎక్కువని, కాబట్టి ఈ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సైతం చెప్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం, ఆర్బీఐలు ఇటీవల ప్రకటించిన ప్యాకేజీలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి ఏ మాత్రం సరిపోవని వారు పెదవి విరుస్తున్నారు.


logo