గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 13, 2021 , 02:36:19

జారుడు బండపై పారిశ్రామికం

జారుడు బండపై పారిశ్రామికం

  • నవంబర్‌లో మైనస్‌ 1.9 శాతం

న్యూఢిల్లీ, జనవరి 12: వరుసగా రెండు నెలలుగా ఆశాజనక పనితీరు కనబరిచిన దేశీయ పారిశ్రామిక రంగం మళ్లీ మైనస్‌లోకి జారుకున్నది. నవంబర్‌ నెలకుగాను పారిశ్రామిక ప్రగతి మైనస్‌ 1.9 శాతానికి పడిపోయింది. తయారీ, గనుల రంగాలు నిరాశావాదంగా ఉండటం పారిశ్రామికంపై ప్రతికూల ప్రభావం చూపింది. ఐఐపీలో 77 శాతానికి పైగా వాటా కలిగిన తయారీ రంగం నవంబర్‌లో 1.7 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్నది. దేశీయ గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గనుల రంగం 7.3 శాతం దిగజారింది. కానీ, విద్యుత్‌ 3.5 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం విశేషం. కరోనా కారణంగా గతేడాది ఆగస్టు వరకు పారిశ్రామిక రంగం ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.  పెట్టుబడులకు సూచికగా ఉన్న క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగం 7.1 శాతానికి పడిపోగా, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ 0.7 శాతం, కన్జ్యూమర్‌ నాన్‌-డ్యూరబుల్‌ 0.8 శాతం పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్యకాలానికి పారిశ్రామిక రంగం మైనస్‌ 15.5 శాతానికి పడిపోయింది. 

VIDEOS

logo