బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 27, 2020 , 21:55:47

ఇండిగో ఉద్యోగులకు రెండో రౌండ్ వేతన కోతలు

ఇండిగో ఉద్యోగులకు రెండో రౌండ్ వేతన కోతలు

న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విమానయాన కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నందున ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ తమ ఉద్యోగులకు రెండో రౌండ్ భారీ వేతన కోతలను ప్రకటించింది. ఈ రౌండ్ పే కట్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సమాచారం.

ఈ విషయాన్ని ఉద్యోగులకు ఇంటర్నల్ కమ్యూనికేషన్ ద్వారా అందజేసినట్లు తెలుస్తున్నది. "ఈ సంవత్సరం మే నెలలో ఏ, బీ బ్యాండ్లు మినహా అన్ని వర్గాల ఉద్యోగుల కోసం బోర్డు అంతటా వివిధ శాతాల వేతన కోతలను అమలు చేయాలని నిర్ణయించాం. తగ్గిన ఆదాయాలకు అనుగుణంగా వ్యయాన్ని సర్దుబాటు చేయడానికి వేతన కోతలను అమలుపరచాల్సిన అవసరం చెప్పడానికి విచారిస్తున్నాం అని ఇండిగో సీఈవో రోనోజోయ్ దత్తా ఇంటర్నల్ కమ్యూనికేషన్ లేఖలో పేర్కొన్నారు.

ఈ-మెయిల్ ప్రకారం దత్తా తన వ్యక్తిగత వేతనాన్ని ఇప్పటివరకు 25 శాతం కోతగా ఉన్నదానికి 35 శాతానికి పెంచారు. సీనియర్ ఉపాధ్యక్షులకు 30 శాతం వేతన కోత విధిస్తారు. ఉపాధ్యక్షులు, ఏవీపీలు వరుసగా 25 శాతం, 15 శాతం వేతన కోతలు ఉన్నాయి. 

ఇలాఉండగా, ఈ నెల ప్రారంభంలో కరోనా వైరస్ సంక్షోభం మధ్య విమానయాన సంస్థ తన మొత్తం ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగించింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున ఉద్యోగులను తొలగించాలని ఎయిర్లైన్స్ నిర్ణయించినట్లు దత్తా జూలై 20 న చెప్పారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో భారత్లో దేశీయ విమాన కార్యకలాపాలు రెండు నెలలపాటు నిలిపివేయబడ్డాయి. దేశీయ విమాన సర్వీసులు మే 25  న తిరిగి ప్రారంభమయ్యాయి.


logo