శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 30, 2020 , 01:07:26

ఎయిర్‌లైన్స్‌లకు కరోనా కష్టాలు

ఎయిర్‌లైన్స్‌లకు కరోనా కష్టాలు

  • భారీగా నష్టపోయిన ఇండిగో, స్పైస్‌జెట్‌లు

ముంబై, జూలై 29: కరోనా వైరస్‌తో విమానయాన సంస్థల ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.   నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు అయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థలపై కరోనా పిడుగు పడింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ అయితే రూ.2,844.30 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.  సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 88 శాతం తగ్గి రూ.1,143.80 కోట్లకు పరిమితమైంది.  మరో సంస్థ స్పైస్‌జెట్‌ మార్చితో ముగిసిన మూడు నెలలకుగాను రూ.3,057.30 కోట్ల ఆదాయంపై రూ.807.10 కోట్ల  నష్టాన్ని నమోదు చేసుకున్నది.  


logo