శుక్రవారం 07 ఆగస్టు 2020
Business - Jul 03, 2020 , 02:42:30

డాక్టర్లు, నర్సులకు ఇండిగో ఆఫర్‌

డాక్టర్లు, నర్సులకు ఇండిగో ఆఫర్‌

న్యూఢిల్లీ, జూలై 2: కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులకు విమాన ప్రయాణ చార్జీల్లో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌ ఈ ఏడాది చివరి వరకు అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆఫర్‌ పొందాలంటే డాక్టర్లు, నర్సులు తమ హాస్పిటల్‌ ఐడీని చెక్‌-ఇన్‌ కౌంటర్‌ వద్ద చూపిస్తే సరిపోతుందని తెలిపింది. ఇండిగో వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్న టిక్కెట్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని , ఈ ఆఫర్‌ కింద టికెట్లు బుక్‌ చేసుకున్నవారు డిసెంబర్‌ 31లోగా ప్రయాణించాల్సి ఉంటుందని వివరించింది. 


logo