శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Jan 17, 2020 , 00:27:12

హైదరాబాద్‌ డమ్మమ్‌ మధ్య ఇండిగో ఫ్లైట్‌

హైదరాబాద్‌ డమ్మమ్‌ మధ్య ఇండిగో ఫ్లైట్‌

న్యూఢిల్లీ, జనవరి 16: చౌక విమానయాన సంస్థ ఇండిగో..మరో మూడు అంతర్జాతీయ రూట్లకు విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నది. వచ్చే నెల 16 నుంచి హైదరాబాద్‌ నుంచి డమ్మమ్‌ మధ్య సర్వీసును ప్రారంభించనున్న సంస్థ..మార్చి 7 నుంచి ముంబై, త్రివేండ్రంల నుంచి డమ్మమ్‌ మధ్య ఫ్లైట్‌ను నడుపనున్నట్లు ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ రూట్లలో సంస్థ అందిస్తున్న సర్వీసుల సంఖ్య 87కి చేరుకోనున్నది. ముంబై, హైదరాబాద్‌, త్రివేండ్రంల మధ్య సంస్థ నడుపుతున్న రోజువారి సర్వీసుల సంఖ్య 10కి చేరుకోనున్నది. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా మధ్య తూర్పు దేశాలకు మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియన్‌ బౌల్టర్‌ తెలిపారు. ప్రస్తుతం సంస్థ 250 విమానాలతో 1,500 రోజువారి సర్వీసులు నడుపుతున్నది.


logo