మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 11, 2020 , 23:41:13

రూ.999కే విమాన టిక్కెట్టు

రూ.999కే విమాన టిక్కెట్టు
  • ఇండిగో ప్రేమికుల దినోత్సవ ఆఫర్‌

కోల్‌కతా, ఫిబ్రవరి 11: ప్రేమికుల దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకొని ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది. ఈ నెల 14 లోపు అమలులో ఉండనున్న ఈ ఆఫర్‌ కింద పది లక్షల సీట్లను కేటాయించింది. ఈ ఆఫర్‌ కింద బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు మార్చి 1 నుంచి సెప్టెంబర్‌ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రేమికుల దినోత్సవం కంటే ముందుగానే ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ అధికారి విలియన్‌ బౌల్టర్‌ తెలిపారు. 


logo
>>>>>>