శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 24, 2020 , 00:12:06

ఏప్రిల్‌ నెల వేతనాల్లో కోత విధించం

ఏప్రిల్‌ నెల వేతనాల్లో కోత విధించం

  • ఉద్యోగులకు ఇండిగో తీపికబురు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో..తన ఉద్యోగులకు ఊరట కల్పించింది. ఏప్రిల్‌ నెలకుగాను సీనియర్‌ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ సీఈవో రోనోజాయ్‌ దత్‌ తెలిపారు. కానీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు మాత్రం కోత వేతనాలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సిబ్బందికి పంపిన ఈ-మెయిల్స్‌లో ఆయన వివరించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 25 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఆయన  చెప్పారు. వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్‌తో సంస్థ ఆదాయంపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతున్నప్పటికీ ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. logo