భారీ లాభాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు

ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ రికార్డు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టంగా 609.83 పాయింట్లు పెరిగి 52,154.13 వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ 151.40 పాయింట్ల లాభంతో 15,314 వద్ద ముగిసింది. వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో మొదలుపెట్టాయి. భారతీయ కంపెనీలు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలు వెల్లడించడం, దాదాపు అన్ని కంపెనీలు లాభాలు సాధించడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ భారత ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు రికార్డు స్థాయిని దాటేశాయి.
భారతీయ కంపెనీలు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం లాభాలలో గత ఏడాదితో పోలిస్తే 49 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2020 నాలుగు త్రైమాసికాల ఫలితాల్లో ఇదే అతిపెద్ద పెరుగుదల. కాగా ఇవాళ సెన్సెక్స్ ఒకదశలో 692 పాయింట్లు పెరిగి 52,235.97 రికార్డు స్థాయిని తాకింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.