e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News Import Duty hit on Tesla | టెస్లా కార్ల కోసం మూడేండ్లు వెయిటింగ్ ?

Import Duty hit on Tesla | టెస్లా కార్ల కోసం మూడేండ్లు వెయిటింగ్ ?

Import Duty hit on Tesla | గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల దిగ్గ‌జం టెస్లా కార్ల కోసం దేశంలోని సంప‌న్నులు.. ఫేమ‌స్ బ్రిగేడ్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ కార్లు భార‌త్ రోడ్ల‌పై ప‌రుగులు తీయ‌డానికి ఏండ్లు ప‌డ‌తాయా.. అంటే అవున‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. దీనికి విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే కార్ల‌పై కేంద్ర అధిక సుంకాలు విధించ‌డ‌మే కార‌ణం అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

సుంకాల త‌గ్గింపున‌కు కేంద్రానికి మ‌స్క్ లేఖ‌

భారీగా ఉన్న దిగుమ‌తి సుంకాల‌ను త‌గ్గించాల‌ని కేంద్రానికి టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ ఇటీవ‌ల లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ దిగుమ‌తి సుంకాల త‌గ్గింపు విష‌య‌మై ఎల‌న్ మ‌స్క్‌కు, భార‌త ప్ర‌భుత్వానికి మ‌ధ్య నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న ఏండ్ల త‌ర‌బ‌డి కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. భార‌త్‌లో దిగుమ‌తి సుంకాల‌పైనే ఎల‌న్‌మ‌స్క్ ఆందోళ‌న చెందుతున్నార‌ని ప‌రిశ్ర‌మ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

చైనాలోని షాంఘై గిగా ఫ్యాక్ట‌రీ నుంచి దిగుమ‌తి చేసుకున్న బ్లూ టెస్లా మోడ‌ల్-3 కారు పుణె వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టింది. కానీ చౌక‌గా భార‌తీయుల‌కు టెస్లా కార్ల‌ను అందుబాటులోకి తేవాలంటే ఎల‌న్‌మ‌స్క్ ఏండ్ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సి రాక త‌ప్ప‌ద‌నిపిస్తున్న‌ది.

లోక‌ల్ త‌యారీతోనే ఫేమ్‌-2 కింద రాయితీ

విద్యుత్ వాహ‌నాల వాడ‌కాన్ని ప్రోత్స‌హించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఫేమ్‌-2 ప‌థ‌కం కింద స్థానికంగా ఉత్ప‌త్తి లేదా అసెంబ్లీంగ్ చేసిన వెహిక‌ల్స్‌పై రాయితీలు వ‌ర్తిస్తాయి. దాంతో స‌ద‌రు కారు లేదా బైక్ ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది. దేశీయంగా ఉత్పాద‌క లేదా అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయ‌డం ఒక్క‌టే మ‌స్క్ ముందు ఉన్న ఏకైక మార్గం.

అమెరికాలో మోడ‌ల్‌3 కారు ధ‌ర రూ.30 ల‌క్ష‌లు

అమెరికాలో టెస్లా మోడ‌ల్-3 కారు ధ‌ర 39,990 డాల‌ర్లు. ఇది అక్క‌డ చౌక ధ‌రే. మ‌న క‌రెన్సీలో సుమారు రూ.30 ల‌క్ష‌లు.. కానీ దిగుమ‌తి సుంకాల వ‌ల్ల మ‌న‌దేశంలో టెస్లా మోడ‌ల్‌-3 కారు ధ‌ర దాదాపు రూ.60 ల‌క్ష‌లు ప‌లికే అవ‌కాశం ఉంది.

కానీ దేశంలో మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్ స్థాపించ‌డానికి టెస్లా పెట్టుబ‌డి పెట్టాలి. స్థానికంగా కార్ల ఉత్ప‌త్తి జ‌రిగితే కేంద్ర ప్ర‌భుత్వం.. టెస్లా కంపెనీ కార్ల‌పై దిగుమ‌తి సుంకం త‌గ్గించ‌డంతోపాటు ఇత‌ర రాయితీల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

దిగుమ‌తి కార్ల‌పై 100 శాతం సుంకం

ఇంపోర్ట్ చేసుకున్న కార్ల‌పై దిగుమ‌తి సుంకం 100 శాతం విధిస్తున్న‌ది కేంద్రం. షిప్పింగ్‌, ఇన్సూరెన్స్ చార్జీల‌తో క‌లిపి కారు ధ‌ర 40 వేల డాల‌ర్ల‌ (రూ.30 ల‌క్షలు) పై చిలుకే. దిగుమ‌తి సుంకం 60 శాతానికి త‌గ్గిస్తే 40 వేల డాల‌ర్ల లోపే కారు ల‌భ్యం అవుతుంది.

సుంకాలు త‌గ్గ‌కుంటే టెస్లా ప్రీమియం కారే

దిగుమ‌తి సుంకాల త‌గ్గింపు లేకుండా ఇండియ‌న్ మార్కెట్‌లో టెస్లా కార్లు ప్రీమియం కార్లుగా ఉంటాయ‌ని కౌంట‌ర్ పాయింట్ రీసెర్చ్ ఆటోమోటివ్ అండ్ డివైజెస్ ఎకోసిస్ట‌మ్ ఐవోటీ రీసెర్చ్ అన‌లిస్ట్ సౌమెన్ మండ‌ల్ పేర్కొన్నారు. ఇటీవలే ఎల‌న్ మ‌స్క్ స్పందిస్తూ.. ప్ర‌పంచంలోకెల్లా అత్య‌ధికంగా భార‌త్‌లో దిగుమ‌తి సుంకం విధిస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇంత‌కుముందు కూడా ఆయ‌న ఇంపోర్ట్ డ్యూటీపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

క‌ర్ణాట‌క‌లో ప్లాంట్ ఏర్పాటుకు ప్లాన్‌.. కానీ

అయితే క‌ర్ణాట‌క‌లో మాన్యుఫాక్చ‌రింగ్ ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా ప్ర‌ణాళిక రూపొందిస్తున్న‌ది. దిగుమ‌తి చేసుకున్న కార్ల విక్ర‌యంలో స‌క్సెస్ సాధిస్తే అది కార్య‌రూపం దాల్చ‌నున్న‌ది. దేశీయ మార్కెట్‌లో ప్రీమియం కార్ల మార్కెట్ ఏడు శాతం.

బ్యాట‌రీ ఖ‌ర్చు త‌గ్గిస్తే రూ.18.6 ల‌క్ష‌ల‌కే కారు

గ‌తేడాది టెస్లా బ్యాట‌రీ డే ఈవెంట్‌లో ఆ సంస్థ కిలోవాట్ బ్యాట‌రీ త‌యారీ ఖ‌ర్చును 56 శాతం త‌గ్గిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అంటే మూడేండ్ల‌లో ఎల‌క్ట్రిక్ కారు ధ‌ర 25 వేల డాల‌ర్లు (సుమారు రూ.18.6 ల‌క్ష‌లు)గా ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. భార‌త్‌లో కార్ల ఉత్ప‌త్తి ప్రారంభిస్తేనే ఈ ధ‌ర‌కు కారు ల‌భిస్తుందంటున్నారు. కానీ, భార‌త్‌లో ఎంట్రీపై టెస్లా ప్లాన్లు ఇంకా వెల్ల‌డి కాలేద‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే భార‌త్ విప‌ణిలోకి మెర్సెడెస్‌, బీఎండ‌బ్ల్యూ

కొన్నేండ్ల క్రిత‌మే మెర్సిడెస్‌, బీఎండ‌బ్ల్యూ వంటి ల‌గ్జ‌రీ బ్రాండ్ కార్లు భార‌త మార్కెట్‌లో ఎంట‌ర‌య్యాయి. గ‌తేడాది పూర్తిగా దిగుమ‌తి చేసుకున్న (ఈక్యూసీ మోడ‌ల్) కారును 1.36 ల‌క్ష‌ల డాల‌ర్ల (రూ.1.01 కోట్లు)కు దేశీయ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఆడీ మూడు ఎస్‌యూవీ కార్ల‌ను 1.33 ల‌క్ష‌ల డాల‌ర్ల (రూ.99.99 ల‌క్ష‌లు)కు ఆవిష్క‌రించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి:

Conflict in Hero Family| హీరో ఫ్యామిలీలో ర‌చ్చ‌.. ‘ముంజాల్స్‌’లో విభేదాలు.. ఎందుకంటే?!

Oxygen : చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్‌ కనిపెట్టిన ప్రీస్ట్లీ

Asaduddin Owaisi: మోదీకి హిందూ మ‌హిళ‌ల సాధికార‌త అక్క‌ర్లేదా..?

TS Cabinet : వ‌చ్చే ఏడాది నుంచి కొత్త మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం

TS Cabinet : 5 సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న‌

Sai Pallavi Tamil | కోలీవుడ్ క‌మ్‌బ్యాక్ కు సాయి ప‌ల్ల‌వి ప్లాన్..?

పుష్ప2 లో నెగెటివ్ రోల్ చేయ‌నున్న సోనూసూద్.. ప్రేక్ష‌కులు అంగీక‌రిస్తారా..!

Hyderabad biryani | హైద‌రాబాదీ బిర్యానీ ఒక్క‌టేనా.. ఈ ప‌ది బిర్యానీల రుచి చూశారా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana