శుక్రవారం 05 జూన్ 2020
Business - May 02, 2020 , 00:58:27

కోరలుచాస్తున్న నిరుద్యోగం

కోరలుచాస్తున్న నిరుద్యోగం

  • ఏప్రిల్‌లో 23.5 శాతానికి: సీఎంఐఈ 

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన లాక్‌డౌన్‌ ఐదు వారాలకుపైగా కొనసాగుతుండటంతో గతనెల దేశంలో నిరుద్యోగ రేటు  14.8 శాతం ఎగబాకి 23.5 శాతానికి పెరిగింది. మార్చి నెలలో ఈ రేటు 8.7 శాతంగా ఉన్నట్టు సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిరుద్యోగ రేటు ఈ ఏడాది మార్చి చివరి వారం నుంచి గతనెల రెండు వారాల వరకు 23 నుంచి 24 శాతం మధ్య కదలాడింది. మార్చి నెల చివరి వారంలో 23.8 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. ఏప్రిల్‌ మొదటి వారంలో తగ్గి 23.4 శాతానికి చేరింది. 

తెలంగాణలో 6.2 శాతమే

నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్న టాప్‌-5 రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఒకటని సీఎంఐఈ తెలిపింది. ఈ జాబితాలో హిమాచల్‌ప్రదేశ్‌ (2.2%) అగ్రస్థానాన్ని కైవసం చేసుకొన్నదని, ఆ తర్వాతి స్థానాల్లో సిక్కిం (2.3%), పంజాబ్‌ (2.9%), ఛత్తీస్‌గఢ్‌ (3.4%), తెలంగాణ (6.2%), ఉత్తరాఖండ్‌ (6.5%) ఉన్నాయని సీఎంఐఈ వెల్లడించింది.


logo