బుధవారం 21 అక్టోబర్ 2020
Business - Sep 01, 2020 , 16:56:23

2021 లో 10.9 శాతం తగ్గనున్న జీడీపీ

2021 లో 10.9 శాతం తగ్గనున్న జీడీపీ

న్యూఢిల్లీ : 2021 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 23.9 శాతం పడిపోనున్నదని, దీని తరువాత దేశం నిజమైన జీడీపీ ముందు కూడా ఎదురుదెబ్బ తగలవచ్చునని స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ) తాజా పరిశోధన నివేదిక ఎకోరాప్ లో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 10.9 శాతం తగ్గవచ్చు. ఇది మునుపటి అంచనా కంటే 4.1 శాతం ఎక్కువ. ఇంతకుముందు, ఎస్బీఐ నిజమైన జీడీపీ వృద్ధిని -6.8 శాతంగా అంచనా వేసింది.

నాలుగో త్రైమాసికం జీడీపీ వృద్ధి 2020 లో 3.1 శాతం. అదే సమయంలో జీడీపీ వృద్ధి ఏడాది క్రితం ఇదే కాలంలో 5.2 శాతం. 2021 ఆర్థిక సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలలో నిజమైన జీడీపీ వృద్ధి ప్రతికూలంగా ఉంటుందని ఎస్బీఐ ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. ఈ కారణంగా పూర్తి సంవత్సరం నిజమైన జీడీపీ వృద్ధి రెండంకెలకు (10.9 శాతం) పడిపోయే ప్రమాదమున్నది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిజమైన జీడీపీ వృద్ధి -12 నుంచి -15 శాతం ఉంటుందని పరిశోధన నివేదిక అంచనా వేసింది. మూడో త్రైమాసికంలో ఇది -5 శాతం నుంచి -10 శాతం వరకు ఉంటుంది. వీరి నివేదిక ప్రకారం, నాలుగో త్రైమాసికంలో నిజమైన జీడీపీ వృద్ధి -2 నుంచి -5 శాతం ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా మార్చి 25 నుంచి విధించిన లాక్డౌన్ కారణంగా దేశ జీడీపీ వృద్ధి మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణించిందని ఎస్బీఐ నివేదిక తెలిపింది.

రెండు సానుకూల విషయాలు 

ఇటీవల రెండు సానుకూల విషయాలు కనిపించాయని తన నివేదికలో ఎస్బీఐ పేర్కొన్నది. మొదటిది జూలై నెలలో ఆర్బీఐ క్రెడిట్ డేటా. అన్ని ప్రధాన రంగాలలో జూలైలో రుణాల పెరుగుదల ఉన్నదని ఇది సూచిస్తుంది. ముఖ్యంగా మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఈ), వ్యవసాయం, అనుబంధ రంగాలు, వ్యక్తిగత రుణ క్రెడిట్ గణనీయంగా పెరిగింది. ఇక రెండవది, మొదటి త్రైమాసికంలో వివిధ రంగాలకు కొత్త ప్రాజెక్టులు ప్రకటించడం. రహదారులు, ప్రాథమిక రసాయన, విద్యుత్, దవాఖానలు వంటి సమాజ సేవలు, నీరు, మురుగునీటి పైపులైన్లకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.

నిర్మాణ, వాణిజ్యం, హోటళ్లు, విమానయాన రంగాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నదని పరిశోధన నివేదిక పేర్కొన్నది. అదనంగా రవాణా సేవలను పునరుద్ధరించాలని సూచించింది. ప్రభుత్వ ఆర్థిక చర్యలతో పాటు ఆర్బీఐ బాండ్లను జారీ చేయడం ద్వారా మౌలిక సదుపాయాలను పెంచాలని వెల్లడించింది.


logo