మంగళవారం 27 అక్టోబర్ 2020
Business - Sep 18, 2020 , 00:16:18

పెరిగిన పెట్రోల్‌ అమ్మకాలు

పెరిగిన పెట్రోల్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌ అమ్మకాలు మళ్లీ కరోనాకు ముందున్న స్థితికి చేరుకున్నాయి. అయితే డీజిల్‌ డిమాండ్‌ మాత్రం ఇంకా తక్కువగానే ఉన్నది. లాక్‌డౌన్‌తో ఇంధన వినియోగం గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల ప్రథమార్ధంలో పెట్రోల్‌ అమ్మకాలు గతేడాదితో పోల్చితే 2.2 శాతం, గత నెలతో చూస్తే 7 శాతం పెరిగినట్లు తేలిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 1-15 మధ్య 9,65,000 టన్నుల విక్రయాలు జరిగాయన్నాయి. కాగా, డీజిల్‌ విక్రయాలు నిరుడుతో పోల్చితే 6 శాతం తక్కువగానే నమోదైనట్లు పేర్కొన్నాయి. అయితే గత నెలతో చూస్తే డిమాండ్‌ 19.3 శాతం పుంజుకున్నదని చమురు మార్కెటింగ్‌ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ నెల ఆరంభం నుంచి 15దాకా 21.3 లక్షల టన్నుల అమ్మకాలున్నాయని చెప్పాయి. కరోనా భయాలతో చాలామంది పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు దూరంగా ఉంటున్నారని, వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారని, ఇది కూడా పెట్రోల్‌ వాడకాన్ని పెంచి, డీజిల్‌ వినియోగాన్ని తగ్గిస్తున్నదని చెప్తున్నారు.


logo