గురువారం 09 ఏప్రిల్ 2020
Business - Feb 17, 2020 , 23:17:04

భారత వృద్ధి అంచనాలో కోత

భారత వృద్ధి అంచనాలో కోత
  • 6.6 శాతం కాదు 5.4 శాతమే: మూడీస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: భారత వృద్ధి అంచనాను మరోసారి కోత విధించింది అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌. ప్రస్తుత సంవత్సరంలో గతంలో 6.6 శాతంగా ఉంటుందని అంచనావేసిన మూడీస్‌.. ఈసారి దీనిని 5.4 శాతానికి తగ్గించింది. దేశీయ ఆర్థిక పరిస్థితులు వేగవంతంగా కోలుకోకపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. గడిచిన రెండేండ్లుగా మందకొడి వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్‌..ప్రస్తుత త్రైమాసికం నుంచి వృద్ధి బాట పడుతున్నప్పటికీ, అంచనావేసిన స్థాయిలో లేదని మూడీ స్‌ తన నివేదికలో వెల్లడించింది. 


ఈ ఏడాది 5.4 శాతం వృద్ధి అంచనావేస్తున్న మూడీస్‌.. 2021లో మాత్రం 5.8 శాతానికి చేరుకోనున్నదని పేర్కొంది. గతంలో 6.6 శాతంగాను, 6.7 శాతంగా వెల్లడించింది. ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధిరేటుకు కేంద్రం ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని, పన్ను రేట్లు తగ్గించకపోవడం మరో కారణమని విశ్లేషించింది. ఆహార ద్రవ్యోల్బణంతో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయని తెలిపింది. 


logo