శనివారం 16 జనవరి 2021
Business - Nov 27, 2020 , 18:22:01

జీడీపీ @ -7.5%

జీడీపీ @ -7.5%

న్యూఢిల్లీ:  జులై-సెప్టెంబ‌ర్ త్రైమాసికానికిగాను భార‌తదేశ స్థూల జాతీయోత్ప‌త్తి (జీడీపీ) -7.5 శాతంగా న‌మోదైంది. అంత‌కు ముందు త్రైమాసికంతో పోలిస్తే జీడీపీ చాలా మెరుగైంద‌నే చెప్పాలి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వ‌రుస లాక్‌డౌన్‌లు విధించ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా కుంటుప‌డింది. దీంతో ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో జీడీపీ -23.9 శాతానికి ప‌త‌న‌మైంది. అయితే జూన్ త‌ర్వాత మెల్ల‌గా లాక్‌డౌన్‌లు స‌డ‌లించ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ గాడిలో ప‌డుతోంది. ఊహించ‌న‌దాని కంటే వేగంగానే ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకుంటున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ కూడా చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తానికి జీడీపీ వృద్ధిరేటు -9.5 శాతంగా ఉండొచ్చ‌ని ఆర్బీఐ అంచ‌నా వేస్తోంది. ఇదే స‌మ‌యంలో చైనా వృద్ధి రేటు మాత్రం 4.9 శాతంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.