శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 01, 2021 , 14:52:04

అంచ‌నాలు దాటిన‌ ద్ర‌వ్య‌లోటు

అంచ‌నాలు దాటిన‌ ద్ర‌వ్య‌లోటు

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు అవ‌స‌ర‌మైన కాయ‌క‌ల్ప చికిత్స చేయ‌డానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పూనుకున్నారు. అందులో భాగంగా వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రాని (2021-22)కి ద్ర‌వ్య‌లోటు 6.8 శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా క‌ట్టారు. ఇది అంచ‌నాల‌ను మించిపోయింద‌ని ప్ర‌ముఖ రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. 

వ‌చ్చే మార్చితో ముగిసే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో అది 9.5 శాతానికి చేరుతుంద‌ని అంచ‌నా వేశారు. గ‌తేడాది బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించిన‌ప్పుడు 3.5 శాతంగా ఉంటుంద‌ని లెక్క గ‌ట్టారు. విశ్వ‌రూపం చూపిన క‌రోనా వ‌ల్ల అది సుమారు మూడు రెట్లు పెరిగింది. 2025-26 నాటికి ద్ర‌వ్య‌లోటును 4.5 శాతానికి తీసుకురావాల‌ని విత్త‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స‌రికొత్త ల‌క్ష్యాలు నిర్దేశించారు. 

మూడీస్ ఇన్వెస్ట‌ర్ స‌ర్వీసెస్ అసోసియేట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గెనె ఫాంగ్ స్పందిస్తూ.. ఇప్ప‌టికే రెవెన్యూ వ‌సూళ్లు బ‌ల‌హీనంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వానికి అందుబాటులో ఉన్న ఆర్థిక వ‌న‌రుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ద్ర‌వ్య‌లోటు ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం క‌ష్ట సాధ్య‌మేన‌ని తెలిపారు. ఆర్థిక రంగానికి మ‌ద్ద‌తు, ఎకాన‌మీని సాధార‌ణ‌స్థాయికి తీసుకు రావ‌డానికి చేప‌ట్టిన చ‌ర్య‌ల మ‌ధ్య స‌మ‌తుల్య‌త సాధించ‌డానికి స‌ర్కార్ ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని ఫాంగ్ వ్యాఖ్యానించారు. 

ప‌రిమిత అవ‌కాశాలు ఉన్నా ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌రుత్తేజానికి మౌలిక వ‌స‌తులు, ర‌వాణా ప్రాజెక్టులు చేప‌ట్టినా, ఆరోగ్య రంగ కేటాయింపులు రెట్టింపు చేసింద‌ని ఫాంగ్‌ తెలిపారు. గ్రోత్ అంచ‌నాలు స్వ‌ల్పంగా ఆశావాహంగా ఉన్నాయ‌ని.. బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాద‌న‌ల వ‌ల్ల ఇప్పుడు భార‌త్‌కు తాము ఇచ్చిన క్రెడిట్ రేటింగ్.. నెగెటివ్ ఔట్‌లుక్‌తో బీఏఏ3.. అన్న విధానంలో తేడా ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo