శనివారం 06 మార్చి 2021
Business - Dec 26, 2020 , 00:26:45

రికార్డు స్థాయికి విదేశీ నిల్వలు

రికార్డు స్థాయికి విదేశీ నిల్వలు

ముంబై: విదేశీ మారకం నిల్వల రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఈ నెల 18తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్‌ రిజర్వులు మరో 2.563 బిలియన్‌ డాలర్లు పెరిగి 581.131 బిలియన్‌ డాలర్లకు చేరుకన్నట్లు రిజర్వు బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 778 మిలియన్‌ డాలర్లు తగ్గి 578.568 బిలియన్‌ డాలర్లకు పరిమితమైన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ పెరుగడం వల్లనే రిజర్వులు రికార్డు స్థాయికి చేరుకున్నాయని తెలిపింది. 1.382 బిలియన్‌ డాలర్లు పెరిగి 537.727 బిలియన్‌ డాలర్లకు విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ చేరుకున్నది. అలాగే గోల్డ్‌ రిజర్వులు 1.008 బిలియన్‌ డాలర్లు ఎగబాకి 37.020 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 


VIDEOS

logo