గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 18, 2020 , 06:59:33

రికార్డు స్థాయికి విదేశీ నిల్వలు

రికార్డు స్థాయికి విదేశీ నిల్వలు

ముంబై: దేశంలో విదేశీ మారకపు నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఈ నెల 10తో ముగిసిన వారాంతానికిగాను మరో 310.80 కోట్ల డాలర్ల మేరకు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి 51636.20 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. జూలై 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 641.60 కోట్ల డాలర్లు పెరిగి 51354 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. జూన్‌ 5న తొలిసారిగా విదేశీ మారకపు నిల్వలు 50 వేల కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. 

జూలై 10తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో ప్రధానమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 237.20 కోట్ల డాలర్లు పెరిగి 47563.50 కోట్ల డాలర్లకు చేరాయి. బంగారం నిల్వలు కూడా 71.2 కోట్ల డాలర్లు పెరిగి 3472.90 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పెరుగడం వల్లనే రిజర్వులు ఎగబాకుతున్నాయని ఆర్బీఐ తెలిపింది. 

తాజావార్తలు


logo