ముంబై, జూలై 23: విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికిగాను 835 మిలియన్ డాలర్లు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి 612.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ నిల్వలు 1.883 బిలియన్ డాలర్లు పెరుగడం విశేషం. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పెరుగుతుండటం వల్లనే విదేశీ నిల్వలు ఆల్‌టైం హైకీ చేరుకుంటున్నాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. సమీక్షకాలంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 463 మిలియన్ డాలర్లు పెరిగి 568.748 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే పసిడి రిజర్వులు మరో 377 మిలియన్ డాలర్లు అధికమై 37.333 బిలియన్ డాలర్లకు చేరాయి.