బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 13, 2020 , 11:19:14

తిరిగి కోలుకుంటున్న స్టాక్‌మార్కెట్లు

తిరిగి కోలుకుంటున్న స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు కొద్దిగా కోలుకుంటున్నాయి. ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే షేర్ల విలువ దారుణంగా పడిపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ను 45 నిమిషాల పాటు మూసివేశారు. 10 గంటల 5 నిమిషాలకు తిరిగి ట్రేడింగ్  ప్రారంభమైన  అనంతరం బీఎస్‌సీ సెన్సెక్స్‌ 474 పాయింట్లు లాభాలతో 33,128 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 119 పాయింట్లు లాభంతో 9700 వద్ద కొనసాగుతోంది. స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిమాణాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిలువునా ముంచేస్తున్నాయి. అమెరికా - యూరప్‌ దేశాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.


logo