బుధవారం 30 సెప్టెంబర్ 2020
Business - Sep 16, 2020 , 01:12:53

కోలుకోని ఎగుమతులు

కోలుకోని ఎగుమతులు

న్యూఢిల్లీ: దేశీయ ఎగుమతులు ఆగస్టులోనూ కోలుకోలేదు. గత నెల 12.66 శాతం క్షీణించినట్లు మంగళవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. నిరుడుతో పోల్చితే 22.7 బిలియన్‌ డాలర్లకే పరిమితమైనట్లు పేర్కొన్నాయి. ఇలా పతనం కావడం ఇది వరుసగా ఆరో నెల. పెట్రోలియం, తోలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఈసారి భారీగా తగ్గాయి. కాగా, దిగుమతులూ 26 శాతం పడిపోయాయి. 29.47 బిలియన్‌ డాలర్లుగానే ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 6.77 బిలియన్‌ డాలర్లుగానే ఉన్నది. గతేడాది ఆగస్టులో ఇది 13.86 బిలియన్‌ డాలర్లుగా ఉండ టం గమనార్హం. 

‘ఈసారి -9 శాతం’

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ జీడీపీ మైనస్‌ 9 శాతానికి క్షీణించవచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) మంగళవారం అంచనా వేసింది. కరోనా వైరస్‌ ఉద్ధృతి దీర్ఘకాలం ఉంటే, కేసులు మరింత పెరుగుతూపోతే ఇంకా పతనం కావచ్చని పేర్కొన్నది. నిజానికి జూన్‌లో మైనస్‌ 4 శాతంగానే అంచనా వేసింది. 

మాంద్యం ముప్పు

ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఏడాది మాం ద్యం ముప్పు ఉందని ఏడీబీ హెచ్చరించింది. దాదాపు 60 ఏండ్లలో ఇలాంటి పరిస్థితి లేదన్నది. ఈ క్రమంలోనే ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ -0.7 శాతానికి పతనం కావచ్చని అంచనా వేసింది. 


logo