వేగం పుంజుకోనున్నభారత ఆర్థికవ్యవస్థ...

ఢిల్లీ : కరోనామహమ్మారీ కారణంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ తర్వాత దేశంలోని అన్నిరకాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి మైనస్ 7.7 శాతంగా నమోదు కావొచ్చునని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా పుంజుకుంటోందని, గతంలో ప్రకటించిన మైనస్ 9 శాతం అంచనాను సవరించినట్లు పేర్కొన్నది.
వేగంగా రికవరీ...
వచ్చే ఏడాది మాత్రం వృద్ధి రేటు 10 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. భారత ఆర్థికవ్యవస్థ వేగంగా రికవరీ బాట పడుతోందని, చెబుతూ వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనాలను సవరిస్తున్నాయి. తాజాగా ఎస్ అండ్ పీ మరోసారి కాస్త సానుకూలంగా సవరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి తిరిగి గాడిలో పడటంతో పాటు ఏకంగా 10 శాతం నమోదు చేయవచ్చునని ఎస్ అండ్ పీ అంచనా వేసింది. డిమాండ్ పుంజుకోవడం, కరోనా వ్యాప్తి రేటు తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక రికవరీ గతంలో అనుకున్న దాని కంటే వేగంగా పుంజుకుంటుందని, అందుకే వృద్ధి రేటును సవరించినట్లు ఎస్ అండ్ పీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 23.9 శాతంగా నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండో త్రైమాసికంలో మైనస్ 9 శాతం నుండి మైనస్ 13 శాతం వరకు రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేసినప్పటికీ మైనస్ 7.5 శాతంగా నమోదయింది. అంచనాల కంటే కాస్త సానుకూలంగా ఉంది. అదే సమయంలో కార్యకలాపాల వేగంగా పెరుగుతున్నాయి. దీంతో రేటింగ్ ఏజెన్సీలు అంచనాలు సవరిస్తున్నాయి.
పెరిగిన స్థూల ఆర్థిక సూచీలు...
వరుసగా రెండు త్రైమాసికాలు భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా నమోదు చేయడంతో సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. సాంకేతికతను పక్కన పెడితే రికవరీ వేగవంతమైంది. తయారీ, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తర్వాత స్థూల ఆర్థిక సూచీలు పెరిగాయి. ఆసియా పసిఫిక్ దేశాల మార్గంలోనే భారత్ వేగంగా కోలుకుంటోందని ఎస్ అండ్ పీ తెలిపింది. ఫిచ్ రేటింగ్స్ కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును మైనస్ 10.5 శాతం నుంచి మైనస్ 9.4 శాతానికి సవరించింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు గతంలో మైనస్ 9 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు మైనస్ 8 శాతంగా అంచనా వేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
తాజావార్తలు
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!