న్యూఢిల్లీ/ ముంబై: బిట్ కాయిన్తోసహా క్రిప్టోకరెన్సీలతో లావాదేవీలను నిర్వహించే విషయమై జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులకు బ్యాంకులు సూచించాయి. క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు దేశంలో అనుమతి లేదు. కనుక ఆ లావాదేవీలు నిర్వహించే కస్టమర్ల ఖాతాలను రద్దు లేదా తాత్కాలికంగా నిలిపివేయడం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలియ జేశాయి.
ఈ విషయమై జాగ్రత్తంగా ఉండాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లతో సహా పలు బ్యాంకులు బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీలు నిర్వహిస్తున్న వారికి ఇ-మెయిల్ పంపాయని తెలుస్తున్నది.
ఈ క్రమంలో 2018 ఏప్రిల్ 6 తేదీన తాను జారీ చేసిన మార్గదర్శకాలను బ్యాంకర్లు పట్టించుకోవద్దని ఆర్బీఐ సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. 2018 గైడ్‌లైన్స్ ప్రకారం మన దేశంలో బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల లావాదేవీలను నిర్వహించడానికి అనుమతి లేదు.
క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలను నిశితంగా గమనించాలని మూడేండ్ల క్రితం బ్యాంకర్లకు ఆర్బీఐ సూచించింది. కానీ ఆ గైడ్‌లైన్స్‌ను గతేడాది మార్చిలో సుప్రీం కోర్టు కొట్టివేసింది.
అయినా క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు దూరంగా ఉండాలని బ్యాంకర్లకు గత నెల మొదటి వారం సూచించింది ఆర్బీఐ. తాజాగా సోమవారం క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 2018 సర్క్యులర్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని బ్యాంకర్లకు సూచించింది.
క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిపే బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్, యెస్బ్యాంక్, పేటీఎం తదితర సంస్థలు ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ లావాదేవీల నిర్వహణకు సంస్థలకు ఆర్బీఐ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తన ఖాతాదారులకు పంపిన ఈ-మెయిల్లో ఎస్బీఐ పేర్కొంది.
ఎస్బీఐ అనుబంధ ఎస్బీఐ కార్డు సైతం తన ఖాతాదారులు వర్చువల్ కరెన్సీ లావాదేవీల నిర్వహణతో చట్టపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇంకా ఖాతాదారుల రక్షణ లాంటివి ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు
N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
ఆనందయ్య మందు పంపిణీకి కాల్ సెంటర్, యాప్..
టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం.. 91 దేశాలపై తీవ్ర ప్రభావం
Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?
దేశంలో వ్యాక్సిన్‌కు కొరత లేదు: ఐసీఎమ్మార్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
రూ 50,000 దిశగా పసిడి పరుగు..రూ 73,000కు చేరువైన వెండి
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
భారీ ఊరట : కొవిడ్-19 నియంత్రణలు పూర్తిగా ఎత్తివేత!
సోషల్సె క్యూరిటీ కోడ్ ఎఫెక్ట్: నేటి నుంచి పీఎఫ్‌తో ఆధార్ లింక్
పైపైకి బంగారం.. డిసెంబర్‌కల్లా రూ.57 వేలకు..!!
చిప్ సప్లయి కొరత: ఇప్పట్లో తేలడం కష్టమే: ఇంటెల్
ఈపీఎఫ్‌వో రిలీఫ్.. సభ్యులకు రెండో కోవిడ్ అడ్వాన్స్!