బుధవారం 03 జూన్ 2020
Business - May 21, 2020 , 23:46:53

2 వేల మందిని తీసేస్తున్న ఇండియాబుల్స్‌

2 వేల మందిని తీసేస్తున్న  ఇండియాబుల్స్‌

ముంబై: దాదాపు 2 వేల మంది ఉద్యోగులను రాజీనామా చేయాలని ఇండియాబుల్స్‌ గ్రూప్‌ కోరింది. పనితీరు ఆధారంగా ఏటా జరిగే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో భాగంగానే ఈ కోతలూ అని సంస్థ చెప్తున్నా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, ఈ నెలాఖరే మా చివరి పనిదినం అని కొంతమంది ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగాల నుంచి తీసేయాలనుకుంటే 3 నెలల ముందే చెప్పాలని ఉన్నా.. ఉన్నట్టుండి తొలగిస్తున్నారని పీటీఐ వద్ద కొందరు ఉద్యోగులు ఆరోపించారు. ఇంకొందరు తమను ఆకస్మికంగా బదిలీ చేస్తున్నారని వాపోయారు.


logo