మంగళవారం 26 మే 2020
Business - May 09, 2020 , 20:06:50

వద్దొంటున్నా ఆ యాప్‌నే వాడుతున్నారు

వద్దొంటున్నా ఆ యాప్‌నే వాడుతున్నారు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ  పుణ్యమా అని జూమ్‌ యాప్‌ అందకుండా పోతున్నది. ఏప్రిల్‌ నెలలో ప్రపంచవ్యాప్తంగా  డౌన్‌లోడ్‌ చేసుకొన్న యాప్స్‌లలో జూమ్‌ మొదటిస్థానంలో నిలిచిందని యాప్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ సెన్సార్‌ టవర్‌ వెల్లడించింది. గత నెలలో ఈ యాప్‌ను 13.1 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకొన్నారు. వీరిలో భారతీయులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. భారత్‌ తరువాత అమెరికా ఈ యాప్‌ను ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసుకొన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ యాప్‌తో భద్రత సమస్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ.. ఇంత ఫాలోయింగ్‌ పెరుగడం అంతా కరోనా పుణ్యమే అని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక జూమ్‌  యాప్‌ తర్వాత రెండోస్థానంలో టిక్‌టాక్‌ నిలిచింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో 10.7 కోట్ల మంది  ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొన్నారు. వీరిలో 22 శాతం మంది భారతీయులే ఉండటం విశేషం.


logo