బుధవారం 03 మార్చి 2021
Business - Feb 22, 2021 , 18:49:04

9 నెల‌ల త‌ర్వాత‌ ‘డ్రాగన్‌’తో సంబంధాలు?!

9 నెల‌ల త‌ర్వాత‌ ‘డ్రాగన్‌’తో సంబంధాలు?!

న్యూఢిల్లీ: స‌రిహ‌ద్దుల్లో రెండు దేశాల సైన్యాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో దేశీయ ప‌రిశ్ర‌మ‌ల్లో చైనా పెట్టుబ‌డుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలుప‌నున్న‌ద‌ని తెలుస్తున్న‌ది. సుమారు 45 చైనా సంస్థ‌ల నుంచి పెట్టుబ‌డుల పెట్ట‌డానికి అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఇందులో చైనా ఆటో దిగ్గ‌జాలు గ్రేట్ వాల్ మోటార్‌, ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేష‌న్ కూడా ఉన్నాయ‌ని రాయిట‌ర్స్ తెలిపింది. 

గ‌తేడాది ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ వ‌ద్ద చైనా సైన్యంతో ఘ‌ర్ష‌ణ‌తో క‌ల్న‌ల్ సంతోష్‌తోపాటు 20 మంది భార‌త సైనికులు అమ‌రులైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశంలోకి చైనా పెట్టుబ‌డుల‌పై నియంత్ర‌ణ నిబంధ‌న‌ల‌ను కేంద్రం  క‌ఠినం చేసింది. 200 కోట్ల డాల‌ర్ల‌కు పైగా సుమారు 150 పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌లు చైనా నుంచి వ‌చ్చాయి. హంకాగ్ మీదుగా వ‌చ్చే అమెరికా, జ‌పాన్ పెట్టుబ‌డుల మాదిరే చైనా కంపెనీల పెట్టుబ‌డుల‌కు అంత‌ర్గ‌త మంత్రిత్వ‌శాఖ ఆమోదం తెలుపాల‌ని అప్ప‌ట్లో కేంద్రం నిర్ణ‌యించింది. 

జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పులేని రంగాల్లో 45కు పైగా చెనా కంపెనీల పెట్టుబ‌డుల‌ను అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వంలో దీంతో సంబంధం ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు చెప్పారు. ఇందులో గ్రేట్ వాల్, ఎస్ఏఐసీ సంస్థ‌ల ప్ర‌పోజ‌ల్స్ ఉన్నాయ‌ని స‌మాచారం. ఉత్పాద‌క రంగానికి సంబంధించిన పెట్టుబ‌డుల‌కు త్వ‌రిత‌గ‌తిన ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తున్న‌ది. దీనిపై స్పందించ‌డానికి కేంద్ర హోంశాఖ అధికార ప్ర‌తినిధి నిరాక‌రించారు. 

భార‌త్‌లో 250-300 మిలియ‌న్ల డాల‌ర్ల విలువ గ‌ల అమెరికా కార్ల ప్లాంట్‌ను కొనుగోలు చేస్తామ‌ని గ్రేట్ వాల్‌, జ‌న‌ర‌ల్ మోటార్స్ జాయింట్ ప్ర‌పోజ‌ల్స్ కేంద్రానికి స‌మ‌ర్పించాయి. వ‌చ్చే ఐదేండ్ల‌లో భార‌త్‌లో 100 కోట్ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్టాల‌ని గ్రేట్ వాల్ మోటార్స్ త‌ల‌పోస్తున్న‌ది. గ్రేట్‌వాల్‌, జ‌న‌ర‌ల్ మోటార్స్ ప్ర‌తినిధులు స్పందిస్తూ.. త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆమోదించాల‌ని భార‌త ప్ర‌భుత్వాన్ని నిరంత‌రం కోరుతూనే ఉంటామ‌న్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo