e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home News క‌రోనా రెండో వేవ్‌: మున్ముందు ఉద్యోగాల క‌ల్ప‌న స‌వాలే!

క‌రోనా రెండో వేవ్‌: మున్ముందు ఉద్యోగాల క‌ల్ప‌న స‌వాలే!

క‌రోనా రెండో వేవ్‌: మున్ముందు ఉద్యోగాల క‌ల్ప‌న స‌వాలే!

న్యూఢిల్లీ: క‌రోనా రెండో వేవ్‌ను నియంత్రించ‌డానికి తాజాగా లాక్‌డౌన్ దిశ‌గా రాష్ట్రాలు ప‌య‌నిస్తున్న వేళ‌. మున్ముందు దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోత విధించే అవ‌కాశం ఉంద‌ని ప్రైవేట్ అధ్య‌య‌న సంస్థ సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ)హెచ్చ‌రించింది. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే మున్ముందు ఉద్యోగాలు స్రుష్టించ‌డం స‌వాల్‌గా మారుతుందన్న ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

సీఎంఐఈ అంచ‌నా ప్ర‌కారం ఆదివారంతో ముగిసిన వారానికి దేశంలో నిరుద్యోగిత 8.6 శాతాన్ని తాకింది. రెండు వారాల క్రితం ఇది 6.7 శాతంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. గ‌తేడాది మాదిరిగానే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిరుద్యోగిత ప్ర‌భావం మ‌రింత తీవ్రంగా ఉంటుంద‌ని అంచ‌నా.

గ‌తేడాది లాక్‌డౌన్ విధించిన‌ప్పుడు అమ‌ల్లోకి వ‌చ్చిన క‌ఠిన ఆంక్ష‌ల‌తో వ‌ర్క‌ర్లు ప‌ట్ట‌ణాల‌ను వీడారు. తాజాగా ఆంక్ష‌లు అమ‌లులోకి వ‌స్తాయ‌న్న ఆందోళ‌న‌తో సుమారు 10 శాతం మంది వ‌ర్క‌ర్లు ఇప్ప‌టికే న‌గ‌రాల‌ను వీడుతున్నార‌ని మీడియాలో వార్త‌లొచ్చాయి.

ఆసియాలోకెల్లా మూడో ఆర్థిక శ‌క్తిగా ఉన్న భార‌త్‌లో రికార్డు స్థాయిలో సోమ‌వారం 1,68,912 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో మొత్తం కేసులు 13.53 మిలియ‌న్ల‌కు చేరాయి. త‌త్ఫ‌లితంగా మొత్తం కేసుల్లో భార‌త్‌.. బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానంలోకి వ‌చ్చేసింది.

క‌రోనా రెండో వేవ్ వ‌ల్ల ప్ర‌జ‌లు ద‌వాఖాన‌ల‌కు ప‌రుగులు తీయ‌డంతో ఆరోగ్య సంక్షోభం మ‌రింత పెరుగుతున్న‌ది. మ‌రోవైపు క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డ‌నికి రాష్ట్రాలు క‌ఠిన ఆంక్ష‌ల అమ‌లు దిశ‌గా ముందుకెళుతున్నాయి.

సంప‌న్న రాష్ట్రంగా పేరొందిన మ‌హారాష్ట్ర‌లో వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టికైతే వారాంత‌పు లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతోపాటు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లులోకి తెచ్చింది.

క‌రోనా రెండో వేవ్‌: మున్ముందు ఉద్యోగాల క‌ల్ప‌న స‌వాలే!

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో ప్ర‌స్తుతం రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంది. ప‌రిస్థితులు విష‌మిస్తే మ‌రిన్ని క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లులోకి తెస్తామ‌ని ఢిల్లీ స‌ర్కార్ హెచ్చ‌రించింది.

గ‌తేడాది విశ్వ‌మారిని నియంత్రించ‌డానికి దేశ‌వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ల‌క్ష‌ల మంది ఉద్యోగుల ఉద్వాస‌కు దారి తీసింది. ల‌క్ష‌ల మంది వ‌ల‌స కార్మికులు ర‌వాణా వ‌స‌తుల్లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతూ కాలి న‌డ‌క‌న సొంతూళ్ల‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. స‌రైన ఆహారం, తాగునీటి వ‌స‌తులు లేక మైళ్ల దూరం కాలి న‌డ‌క‌నే ముందుకు వెళ్లాల్సిన దుస్థితి నెల‌కొంది.

మ‌ధ్య‌లో కాస్తంత ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో ఆర్థిక కార్య‌క‌లాపాలు పున‌రుద్ధ‌రించినా.. ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలో క‌రోనా కేసులు పుంజుకోవ‌డం అన్ని వ‌ర్గాల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్న‌ది.

గ‌త నెల‌లో కొవిడ్‌-19 కేసులు పుంజుకుని ప‌రిస్థితులు దారుణంగా మార‌డంతో గ‌తేడాది సెప్టెంబ‌ర్ త‌ర్వాత ఉద్యోగాలు ప‌డిపోయాయ‌ని ఐహెచ్ఎస్ మార్కిట్ పేర్కొంది. ఆర్బీఐ క‌న్జూమ‌ర్ కాన్ఫిడెన్స్ స‌ర్వే సైతం ఉద్యోగాల‌ప‌ట్ల నిరాశావాదం నెల‌కొంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

నిరంత‌ర ఆంక్ష‌లు, రాత్రి క‌ర్ఫ్యూల‌ను కొన‌సాగించ‌డం వ‌ల్ల మ‌రో ద‌ఫా వ‌ల‌స కార్మికులు త‌మ సొంతూళ్ల‌కు బ‌య‌లుదేరి వెళ‌తార‌ని బెంగ‌ళూరులోని సొసైటీ జ‌న‌ర‌ల్ జీఎస్సీ ఎక‌న‌మిస్ట్ కునాల్ కుందు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మున్ముందు ఉద్యోగాలు క‌ల్పించ‌డం స‌వాల్‌గా ప‌రిణ‌మిస్తుంద‌ని హెచ్చ‌రించారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

క‌రోనా క‌ల్లోలం.. ఇండియాలో కొత్త‌గా 1.69 ల‌క్ష‌ల కేసులు

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

బెస్ట్ డైర‌క్ట‌ర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బాఫ్టా అవార్డ్ వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప్రియాంక చోప్రా, నిక్

సెకండ్ వేవ్‌.. ధారావి మ‌ళ్లీ విజేత‌గా నిలుస్తుందా ?

క‌రోనా ఎఫెక్ట్‌: అక్క‌డ 18 జిల్లాల్లో లాక్‌డౌన్

హ‌రిద్వార్‌లో నిరంజ‌ని సాధ‌వుల పుణ్య స్నానాలు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బెడ్ల కొర‌త‌.. వీల్ చైర్ల‌పైనే రోగుల‌కు చికిత్స‌

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

ఈ స్మార్ట్‌ ఫోన్‌ పై రూ.40వేల తగ్గింపు

రూ.46 వేల‌కు పైనే ప‌సిడి ధ‌ర

బంగారం షాపుల్లో రద్దీ

కొవిడ్‌-19 : ఎయిమ్స్‌ చీఫ్‌ వార్నింగ్‌!

Advertisement
క‌రోనా రెండో వేవ్‌: మున్ముందు ఉద్యోగాల క‌ల్ప‌న స‌వాలే!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement