శనివారం 30 మే 2020
Business - Apr 16, 2020 , 00:42:55

రతుల్‌ పురికి స్విస్‌ నోటీసులు

రతుల్‌ పురికి స్విస్‌ నోటీసులు

  • తండ్రి దీపక్‌ కపూర్‌, మరో రెండు సంస్థలకు కూడా

న్యూఢిల్లీ/బెర్న్‌, ఏప్రిల్‌ 15: భారతీయ వ్యాపారవేత్త రతుల్‌ పురి, ఆయన తండ్రి దీపక్‌ పురి, వీరికి చెందిన రెండు సంస్థలకు స్విట్జర్లాండ్‌ పన్ను అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. వీరి స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల వివరాలను కేంద్రం కోరిన నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ ఈ నోటీసులను ఇచ్చింది. కాగా, భారత్‌ అభ్యర్థనపై అభ్యంతరాలుంటే 10 రోజుల్లోగా ఓ ప్రతినిధిని నియమించుకోవాలని స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రత్యేక నోటీసుల్లో స్పష్టం చేసింది. రతుల్‌ పురి మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌ నాథ్‌ మేనల్లుడు. హిందుస్థాన్‌ పవర్‌ప్రాజెక్ట్స్‌ చైర్మన్‌. ఈయనపై మనీ లాండరింగ్‌ ఆరోపణలున్నాయి. 


logo