మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 12:27:46

త‌గ్గిన ప్యాసింజ‌ర్ కార్ల అమ్మ‌కాలు

త‌గ్గిన ప్యాసింజ‌ర్ కార్ల అమ్మ‌కాలు

హైద‌రాబాద్ : దేశంలో ప్యాసింజ‌ర్ కార్ల అమ్మ‌కాలు త‌గ్గాయి. జూన్ నెల‌లో కార్ల అమ్మ‌కాలు త‌గ్గాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే భారతదేశ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 57.98 శాతం తగ్గిన‌ట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కార‌ణంగా విధించిన‌ లాక్‌డౌన్ వ‌ల్ల దేశంలో ఆటోమొబైల్ రంగం డిమాండ్ లేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది.

పరిశ్రమల సంఘం నివేదిక ప్ర‌కారం జూన్ 2019తో పోలిస్తే జూన్ 2020లో ప‌లు వాహ‌నాల అమ్మ‌కాల్లో న‌మోదైన క్షీణ‌త‌ వివ‌రాలిలా ఉన్నాయి. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 31.16 శాతం,  వ్యాన్ల అమ్మ‌కాలు 62.06 శాతం త‌గ్గిన‌ట్లు తెలిపింది. సియామ్ తాజా గణాంకాల ప్రకారం ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 49.59 తగ్గాయి. ద్విచక్ర వాహన అమ్మ‌కాల్లో 38.56 శాతం, త్రీ వీలర్ల వాహ‌న‌ అమ్మకాలు 80.15 శాతం తగ్గాయి. జూన్ 2019 తో పోల్చితే ప్రయాణీకుల వాహనాలు, త్రీ వీలర్లు, ద్విచక్ర వాహనాల మొత్తం ఎగుమతులు జూన్ 2020 లో వరుసగా 56.31 శాతం, 34.98 శాతం, 34.25 శాతం తగ్గాయని సియామ్ తెలిపింది.


logo