గురువారం 04 జూన్ 2020
Business - May 11, 2020 , 16:56:11

యాపిల్ ఐఫోన్ ఉత్ప‌త్తుల కేంద్రంగా భార‌త్‌..

యాపిల్ ఐఫోన్ ఉత్ప‌త్తుల కేంద్రంగా భార‌త్‌..

హైద‌రాబాద్‌: ఎల‌క్ట్రానిక్స్‌, టెక్నాల‌జీ సంస్థ యాపిల్‌.. ఇక నుంచి ఇండియాలో భారీ స్థాయిలో త‌మ ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసే అవ‌కాశాలు ఉన్నాయి.  చైనాలో ఉన్న ఆ కంపెనీ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని.. ఇండియాకు మార్చ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఉత్ప‌త్తి సంబంధిత స్కీమ్‌ల‌కు భార‌త ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకున్న యాపిల్ సంస్థ‌.. ఇక నుంచి ఇండియాలో భారీ స్థాయిలో ఐఫోన్ల‌ను త‌యారు చేయాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. యాపిల్ త‌ర‌పున ఫాక్స్‌కాన్‌, విస్ట్ర‌న్ సంస్థ‌లు స్మార్ట్‌ఫోన్ల‌ను త‌యారు చేస్తున్నాయి. అయితే యాపిల్ సంస్థ ఆ కాంట్రాక్ట‌ర్ల‌ను భార‌త్ కేంద్రంగా ప‌నిచేయించుకోవాల‌ని చూస్తున్న‌ది. 40 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన యాపిల్ ఉత్ప‌త్తుల‌పై ఆ సంస్థ క‌న్నేసిన‌ట్లు నివేదిక‌లు అంచ‌నా వేస్తున్నాయి. 

ప్ర‌స్తుతం ఇండియన్ స్మార్ట్‌ఫోన్ ఇండ‌స్ట్రీలో యాపిల్ వాటా త‌క్కువే. ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్లను ఇండియాలోనే త‌యార‌వుతున్నాయి. గ‌తంలో ఎస్ఈ, 6ఎస్ ఫోన్ల‌ను ఉత్ప‌త్తి చేసినా.. ఇప్పుడు వాటిని నిలిపేశారు. ఇండియాలో ఉత్ప‌త్తిని పెంచే విష‌యంపై యాపిల్ సంస్థ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా.. దాని మార్కెట్ విలువ ఇటీవ‌ల 62.7 శాతం పెరిగిన‌ట్లు ఐడీసీ డేటా చెబుతున్న‌ది.   యాపిల్ సంస్థ రిటేల్ సెంట‌ర్ల‌ను కూడా ఇండియాలో ప్రారంభించ‌నున్న‌ట్లు పేర్కొన్న‌ది.  2021లో యాపిల్ రిటేల్ స్టోర్లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇటీవ‌ల సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఐఫోన్ ఎస్ఈని యాపిల్ ఇటీవ‌ల లాంచ్ చేసింది. దాన్ని ఇండియాలో కూడా అమ్మ‌నున్న‌ది. హోంపాడ్ స్మార్ట్ స్పీక‌ర్‌, ల్యాప్‌ట్యాప్‌ల‌ను కూడా యాపిల్ త‌యారు చేయ‌నున్న‌ది.


logo